తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 5:40 PM IST

ETV Bharat / state

వర్షంతో నేలకొరిగిన వృక్షం... ట్రాఫిక్​కి తీవ్ర అంతరాయం..

ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి ఓ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీతో చెట్టును తొలిగించారు.

heavy-traffic-jam-at-konijarala-mandalam-in-khammam-highy-way-due-to-tree-fall
వర్షంతో నేలకొరిగిన వృక్షం... కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు కూడలిలో ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. వైరా వైపు వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద వృక్షం కూలిపోయింది. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.సుమారు రెండు వైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి.

వర్షంతో నేలకొరిగిన వృక్షం... కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

వర్షం కురిసిన కారణంగా వాహన చోదకులు మరింత ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్టును తొలిగించారు.

ఇవీ చూడండి:'జూన్​ 30 వరకు చార్​ధామ్​ యాత్రకు అనుమతి లేదు'

ABOUT THE AUTHOR

...view details