గత రెండు రోజులుగా ఖమ్మంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు బయటకు వచ్చేందుకు అనుమతి ఉండటం వల్ల ప్రజలు ఎండలో బయటకు వచ్చి పనులు ముగించుకుంటున్నారు.
ఖమ్మంలో దంచికొడుతున్న ఎండలు - ఖమ్మం తాజా వార్తలు
లాక్డౌన్ సడలింపులతో బయటకు వచ్చిన ఖమ్మం జిల్లా వాసులను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండి పోతున్నాయి.

ఖమ్మంలో దంచికోడుతున్న ఎండలు
బయటకు వచ్చే వారు గొడుగులు తీసుకుని వస్తున్నారు. ఎండ తాపానికి తట్టుకోలేని ప్రజలు కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు సేవిస్తున్నారు. ప్రజలు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. మునుముందు ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు బయపడిపోతున్నారు.
ఇదీ చూడండి :'ఆ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు'