ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైరా జలాశయానికి భారీ మొత్తంలో వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 20 అడుగులకు చేరి అలుగుపోస్తోంది.
వైరాలో భారీ వర్షం... అలుగుపోస్తున్న చెరువులు - వైరాలో పొంగి పొర్లుతున్న వాగుల
వైరా నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏన్కూరు, కారేపల్లి మండలాల నుంచి వైరా జలాశయానికి భారీగా వరదనీరు చేరింది.
వైరాలో భారీ వర్షం... అలుగుపోస్తున్న చెరువులు
కొణిజర్ల- ఏన్కూరు మండలాల నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. వైరా జలాశయంతో పాటు అన్ని మండలాల్లో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏన్కూరు మండలం తూతక లింగన్నపేట పెద్ద చెరువు పొంగి ఇల్లెందు రహదారిని కమ్మేసింది. రహదారులు, పొలాలు నీట మునిగాయి. మరోవైపు పత్తి, మిరప, వరిపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.