ఖమ్మంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మధ్యాహ్న సమయంలో వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఖమ్మంలో భారీ వర్షం... పలు ప్రాంతాలు జలమయం - ఖమ్మంలో భారీ వర్షం
ఖమ్మంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు వర్షం భారీ వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది.

rains in khammam
నగరంలోని మయూరి కూడలి బస్ స్టాండ్ సెంటర్ ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. విజయనగర్ కాలనీ, దానవాయిగూడెం, పాండురంగాపురం, సుందరయ్య నగర్ మూడో పట్టణ ప్రాంతంలోని పలు కాలనీల్లో నీరు చేరింది.
ఇదీ చదవండి :ఇద్దరు వ్యక్తులు అరెస్టు... 24 కిలోల గంజాయి పట్టివేత