ఖమ్మం జిల్లాలో వరసగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నదాతలు... కుండపోతగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోతున్నారు. తాజాగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవగా.. పొలాల్లో వరదచేరి పత్తి పంట దెబ్బతింది. కూరగాయల పంటలు నాశనమయ్యాయి. నష్టపోయిన పంటలను పరిశీలించి ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతుల పాలిట శాపంగా మారిన అతివృష్టి - nastam
ఖమ్మం జిల్లా ఏన్కూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, కామేపల్లి, జూలూరుపాడు మండలాల్లో పత్తి, వరి పంటలు నీటిపాలయ్యాయి. వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయి.
రైతుల పాలిట శాపంగా మారిన అతివృష్టి