ఖమ్మంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముందు జాగత్రగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు గంటపాటు ఎదతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బస్టాండ్ సమీపంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.