ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మధిర నియోజకవర్గంలోని వైరా నది, మున్నేరు, కట్టలేరు నదులు పొంగిపొర్లుతున్నాయి.
జోరు వానలు... నదుల పరవళ్లు - ఖమ్మం వార్తలు
ఖమ్మం జిల్లా మధిరలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వర్షపు నీటితో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.
జోరు వానలు... నదుల పరవళ్లు
మధిర అంబర్పేట మధ్య ఉన్న పెద్ద చెరువు అలుగు పారుతోంది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చిలుకూరు వద్ద వైరా, కట్టలేరు నదుల సంగమం వద్ద భారీగా నీరు చేరుతోంది.
ఇదీ చూడండి:సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు