ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎరుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఎర్రుపాలెం నుంచి గంగినేని వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వరద ఉధృతితో పోటెత్తడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పొంగి పొర్లుతున్న కొండవాగు - ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షం
రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొండవాగు పొంగి పొర్లుతోంది. దీంతో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పొంగి పొర్లుతున్న కొండవాగు