తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏన్కూరులో భారీ వర్షం.. పంట పొలాలకు తీవ్ర నష్టం - Rain in Enkoor

ఖమ్మం జిల్లా ఏన్కూరులో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో రహదారులన్నీ జలమయం కాగా.. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Heavy rains in Enkoor .. Severe damage to crop fields
ఏన్కూరులో భారీ వర్షం.. పంట పొలాలకు తీవ్ర నష్టం

By

Published : Sep 20, 2020, 7:29 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. రహదారులు, ఇళ్లు జలమయమయ్యాయి. జన్నారం వద్ద ఏరు పొంగడంతో ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

వరద తాకిడికి పత్తి, మిరప, వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవలే కురిసిన వర్షాలకు మిరప నారు కొట్టుకుపోయి నష్టాల్లో ఉన్న రైతులను ఈ వర్షం మరింత కుంగదీసింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details