ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు - COMBINED KHAMMAM DISTRICT HEAVY RAINS
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో శనివారం ఉదయం నుంచీ ఆదివారం రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. రెండ్రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో... పూర్వ జిల్లాలోని అన్ని మండలాలు తడిసిముద్దయ్యాయి. పలు మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు
By
Published : Jul 9, 2020, 1:30 PM IST
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 28.7మి.మి. వర్షపాతం నమోదు కాగా... అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 51.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా మొత్తం 18.0 మి.మి.వర్షపాతం నమోదుకాగా... అత్యధికంగా అశ్వారావుపేట మండలంలో 38.4 మి.మి.నమోదైంది.
ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం ( మి.మీలలో)
వర్షపాతం
మి.మీలలో
సింగరేణి
47.0
కామేపల్లి
33.6
రఘునాథపాలెం
20.8
ఖమ్మం
23.6
తిరుమలాయపాలెం
17.4
కూసుమంచి
9.4
నేలకొండపల్లి
20.0
ముదిగొండ
16.8
చింతకాని
22.8
ఖమ్మం అర్బన్
21.2
కొణిజర్ల
28.2
ఏన్కూరు
42.2
కల్లూరు
32.8
పెనుబల్లి
35.0
సత్తుపల్లి
51.0
వేంసూరు
47.8
తల్లాడ
26.6
వైరా
26.2
బోనకల్
47.2
మధిర
20.4
ఎర్రుపాలెం
11.8
భద్రాద్రి జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం ( మి.మీలలో)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 18.0 మి.మి. వర్షపాతం నమోదైంది.
వర్షపాతం
మి.మీలలో
అశ్వారావుపేట
38.4
జూలూరుపాడు
33.2
భద్రాచలం
26.2
బూర్గంపాడు
25.4
దమ్మపేట
23.4
అశ్వాపురం
21.2
గుండాల
20.4
ఇల్లందు
16.4
దుమ్ముగూడెం
18.2
ముల్కలపల్లి
15.8
చర్ల
12.2
చంద్రుగొండ
13.2
టేకులపల్లి
12.2
కొత్తగూడెం
9.2
పాల్వంచ
6.6
మణుగూరు
9.2
గత సీజన్ కంటే ఈ సారి ఆశాజనకం
గత సీజన్ జూలై 5 నాటి కంటే ఈ సారి సీజన్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జూన్ 1 నుంచి జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 149.1 మి.మి.కాగా.. ఇప్పటి వరకు 264.2 మి.మి నమోదైంది. అంటే సుమారుగా 77.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 18 మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా.. 3 మండలాలు కూసుమంచి, ముదిగొండ, చింతకాని సాధారణ వర్షపాతం నమోదైంది.
భద్రాద్రి జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 197.8 మి.మి. నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు 290.6 మి.మి నమోదైంది. సుమారు 46.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు అత్యధికంగా సింగరేణిలో 381.4 మి.మి. వర్షపాతం నమోదుకాగా... కూసుమంచి మండలంలో సాధారణ వర్షపాతం 145.6 మి.మి.నమోదైంది.
భద్రాద్రి జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు అత్యధికంగా ముల్కలపల్లి మండలంలో 426.4 మి.మి. వర్షపాతం నమోదుకాగా... టేకులపల్లిలో 203.2 మి.మి. సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో ఈ ఐదురోజుల్లలో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం 43.9 మి.మి. కాగా.... ఇప్పటి వరకు 74.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 70.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలో జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 53 మి.మి ఉండగా... ఇప్పటి వరకు 90.2 మి.మి వర్షపాతం నమోదైంది. సుమారు 70.1 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.