ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి గ్రామాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. పురపాలక పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఆరో వార్డు ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఛైర్మన్ జైపాల్ నీటమునిగిన కాలనీలను పరిశీలించి వరదనీటి మళ్లింపు ఏర్పాట్లను పరిశీలించారు.
వైరాలో భారీ వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు - ఖమ్మం జిల్లా వైరాలో భారీ వర్షం
ఖమ్మం జిల్లా వైరాలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఉరుములు మెరుపులతో వాన పడడం వల్ల పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.
వైరాలో భారీ వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు
ఉరుములు మెరుపులతో వర్షం పడటం వల్ల పిడుగుపాటుకు వైరాలో చంద్రం అనే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. కొనిజర్ల, ఏన్కూర్ మండలాల్లో వాగులు పొంగి ప్రవహించడం వల్ల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాగులవెంట వరద ఉద్ధృతికి పంట పొలాలు నీటమునిగాయి.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు