ఖమ్మంలో ఈరోజు కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలయమంగా మారాయి. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. అధిక రద్దీ ఉండే బొమ్మన సెంటర్లో మోకాళ్ల లోతు నీరు చేరింది.
ఖమ్మంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం - ఖమ్మంలో భారీ వర్షం
ఖమ్మంలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా నగరవాసులు ఉపశమనం పొందారు. స్థానిక బొమ్మన సెంటర్లో రహదారులన్నీ జలమయంగా మారాయి. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఖమ్మంలో భారీ వర్షం..
వర్షపు నీరు స్థానికంగా ఉండే దుకాణాల్లోకి చేరింది. దీంతో వినియోగదారులు, దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాదారులు సైతం నీళ్లలోనే వాటిని తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువల్లోని డ్రైనేజీ ఉప్పొంగి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి.