భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం దాటింది.
ఎడతెరిపిలేని వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - తెలంగాణ తాజా వార్తలు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షాలకు జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. వైరా జలాశయానికి భారీగా వరద పోటెత్తడం వల్ల పూర్తిస్థాయి నీటిమట్టం 18 అడుగులను దాటింది.
ఎడతెరిపిలేని వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
వరద నీటితో ఏన్కూరు-కొనిజర్ల మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో చెరువులు వాగులు ఉద్ధృతంగా పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంటపొలాలు వరద నీటిలో మునిగాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి తలసాని