భారీవర్షాల కారణంగా ఖమ్మం జిల్లా వైరా సత్తుపల్లి నియోజకవర్గంలో లోతట్టు గ్రామాలు వరద నీటితో పోటెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. తల్లాడ మండలం వెంగన్నపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని ఓ పెంకుటిల్లు కూలి 20 గొర్రెలు మృతి చెందాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం... జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నభారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రధానరహదారులపై నుంచి వరద నీరు పొంగిప్రవహిస్తుండడం వల్ల వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 18 అడుగులు దాటింది.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం... జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
సత్తుపల్లి జాతీయ రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వైరా జలాశయంలోకి ఎగువ నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18 అడుగులు దాటింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. ఏన్కూరు కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో భారీ వర్షం... స్తంభించిన జనజీవనం