ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తోంది. ఖమ్మం పట్టణంలో తెల్లవారుజాము నుంచి జల్లు పడుతోంది. వర్షాల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లోకి... కుంటలోకి... నీరు చేరుతోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే చెరువుల నిండుతాయని కర్షకులు భావిస్తున్నారు. సెలవు దినం కావటం వల్ల వేడి పానియాలు తాగుతూ నగరవాసులు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
వాన జల్లు... తెచ్చింది ఆనందాల హరివిల్లు - HEAVY RAIN IN KHAMMAM DISTRICT
ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లావాసులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల ముఖాల్లో సంతోషం విరబూసింది.
HEAVY RAIN IN KHAMMAM DISTRICT