ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నీరు భారీ ఎత్తున నిలవటం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖమ్మంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - khammam news
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఖమ్మం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి... చెరువులను తలపిస్తున్నాయి.
![ఖమ్మంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం heavy rain in khammam and full of water in strrets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8142715-1038-8142715-1595505722219.jpg)
heavy rain in khammam and full of water in strrets
నివాసాల మధ్య నిండిన వరద నీరు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని పాండురంగాపురం, దనవాయిగూడెం, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రోడ్ల మీదకు నీరు చేరగా... వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. లకారం వాగుకు వరద నీరు పోటెత్తుతోంది.