తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆరో విడత హరితహారంలో భాగంగా ఆయన ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. హరితహారం ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
హరితహారంలో భాగంగా మదన్‌లాల్ బైక్‌ర్యాలీ - harithaharm rally by former mla madan lal at enkur
ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆరో విడత హరితహారంలో భాగంగా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. హరితహారం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏన్కూరు హిందూ శ్మశానవాటికలో ఆయన మొక్కలు నాటారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన వైరా మాజీ ఎమ్మెల్యే
అనంతరం మదన్‌లాల్ ఏన్కూరు హిందూ శ్మశానవాటికలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న 30 కోట్ల మొక్కలు నాటేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.