ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ప్రధాన కూడళ్లలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తెలంగాణ గురుకుల విద్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఎమ్మెల్యే, అధికారులు మొక్కలు నాటారు. అంతరిస్తున్న అడవులను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సామాజిక వనాల పెంపుదలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా ముందుకు రావాలన్నారు.
వేలాది మందితో వైరా పట్టణంలో హరితహారం - PRADHRSHNA
ఖమ్మం జిల్లా వైరాలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు వైరా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.
వేలాది మందితో వైరా పట్టణంలో హరితహారం