తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి - ఇంద్రకరణ్ రెడ్డి

మొక్కలు పెంచకపోతే భావితరాలకు అన్యాయం చేసిన  వాళ్లమవుతామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని సూచించారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి

By

Published : Aug 11, 2019, 5:21 PM IST

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల అటవీ క్షేత్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అటవీ పార్క్​లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్, వాటర్ ప్లాంట్, యోగ సెంటర్​లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్బన్ పార్క్​లో మొక్కలు నాటారు. మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details