మధిరలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు - madhira news
గురుపౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని తక్కువ సంఖ్యలో భక్తులను అనుమతించారు.
gurupournami special worships in madhira saibaba temple
ఖమ్మం జిల్లా మధిరలో గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పసురా గ్రూప్ సంస్థల అధినేత పబ్బతి మోహన్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో తక్కువ సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సమీప గ్రామాల నుంచి సైతం వచ్చిన భక్తులు బాబాను దర్శించుకున్నారు. ప్రసాదాలను పట్టణంలోని ఇంటింటికి పంపించారు.