కరోనా నివారణకు లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకుండా.. పలు స్వచ్ఛంధ, ధార్మిక సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా మూడవ పట్టణ ప్రాంతంలో కన్యకాపరమేశ్వరీ ఆలయంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో పేదలు తరలి వచ్చారు. అందరికీ బియ్యం, నూనె, పసుపు, కారం, చింతపండులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఆర్జేసీ కృష్ణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఖమ్మంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - corona effect updates
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో స్వచ్ఛంధ సంస్థలు పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఆర్జేసీ కృష్ణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ