కరోనా విజృంభించకుండా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో... వెల్లివిరుస్తున్న దాతృత్వం - లాక్డౌన్ సమయం
లాక్డౌన్ సమయంలో పేదలకు ఇబ్బంది కలుగకుండా పలువురు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యావసర వస్తువులు అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
లాక్డౌన్ సమయంలో... వెల్లివిరుస్తున్న దాతృత్వం
ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ కేవీ కృష్ణారావు... తల్లాడ మండలంలో కొత్త మిట్టపల్లి గ్రామంలో 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వైరా సీఐ వసంత్ కుమార్ చేతుల మీదుగా బియ్యం, సరుకులు, కూరగాయలతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయించారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?