ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారికి పోలీసుల పహారాతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకూ వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి కోసం రెండు మండలాల్లో సర్వే చేశారు. కొంతకాలంగా రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతోపాటు సర్వేని అడ్డుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు బృందంగా ఏర్పడి పోలీసుల పహారా మధ్య ఇంజనీరింగ్ సిబ్బంది సర్వే నిర్వహించారు.
గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న అన్నదాతలు - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారికి రెవెన్యు అదికారులు సర్వే చేపట్టారు. భుములను ఇచ్చేటందుకు నిరాకరించిన రైతులు సర్వే అధికారులను అడ్డుకున్నారు.
![గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న అన్నదాతలు Greenfield highway project stalled due to land problems in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7962032-348-7962032-1594311499469.jpg)
గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
సాగర్ ఆయకట్టు, వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఉన్న భూములు చాలా విలువైనవని.. ఏడాదికి రెండు పంటలు పండే భూములని హైవే రహదారికి ఇచ్చే ఉద్దేశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటించకుండా సర్వే చేయటం రైతులను ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. భూముల ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండీ:కోరట్లగూడెంలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. లారీ సీజ్