తెలంగాణ

telangana

ETV Bharat / state

టెక్నాలజీ మహత్యం.. గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం.. - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

డ్రోన్ సాంకేతికత ఇప్పుడు పట్టణాల్లోని ఆలయాలకు చేరింది. తిరుమల, శ్రీశైలం, యాదాద్రి వంటి పెద్ద ఆలయాల్లో ఉపయోగించే ఈ సాంకేతికతను ఇప్పుడు పట్టణాల్లోని ఆలయాలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఓ ఆలయంలో భారీ గరుత్మంతుడి విగ్రహానికి డ్రోన్ సాయంతో అభిషేకం చేశారు.

భారీ గరుత్మంతుడి విగ్రహానికి  డ్రోన్ సాయంతో అభిషేకం
భారీ గరుత్మంతుడి విగ్రహానికి డ్రోన్ సాయంతో అభిషేకం

By

Published : May 15, 2022, 7:09 PM IST

ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ వేడుకల్లో భాగంగా.. ఆలయం బయట ఉన్న గరుత్మంతుడి భారీ విగ్రహానికి అభిషేకం చేయాల్సి ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తున విగ్రహానికి అభిషేకం చాలా శ్రమలో కూడుతున్న పని.

అయితే నిర్వాహకులు ఈ సమస్యకు నిర్వాహకులు చిన్న ఉపాయంతో వినూత్న పరిష్కారం చూపారు. డ్రోన్ సాయంతో గరుత్మంతుడి విగ్రహానికి అభిషేకం చేశారు. డ్రోన్ కింద ఉన్న బాక్స్​లో అభిషేక జలాలు నింపి.. స్వామి వారిపై పడేలా అపరేట్ చేశారు. వినూత్నంగా జరిగిన ఈ అభిషేకాన్ని భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పెద్దపెద్ద ఆలయాల్లోనే ఉపయోగించే ఈ డ్రోన్ టెక్నాలజీ ఇలా మండలాలకు చేరింది.

టెక్నాలజీ మహత్యం.. గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం..

ABOUT THE AUTHOR

...view details