తెలంగాణ

telangana

ETV Bharat / state

పండిన ప్రతి గింజనూ కొంటాం: రాములు నాయక్ - ఎమ్మెల్యే రాములు నాయక్

పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మార్క్​ఫెడ్ వైస్​ ఛైర్మన్​ బొర్ర రాజశేఖర్​తో కలిసి ప్రారంభించారు.

grain purchase centers at enkuru in khammam district
మీరు పండించిన ప్రతి గింజనూ కొంటాం

By

Published : Apr 14, 2020, 4:50 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వల్ల పంట కొనుగోలు విషయంలో అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. రైతుల కోసం కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మార్క్​ఫెడ్ వైస్​ ఛైర్మన్​తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను ఆశ్రయించకుండా తమ ప్రాంతాలకు కేటాయించిన కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కోరారు. ధాన్యం అమ్మేటప్పుడు సామాజిక దూరం పాటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details