తెలంగాణ పట్ల నిజాయతీ, నిబద్ధత కలిగిన వారు మాత్రమే చట్టసభల్లో ఉండాలని యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఖమ్మంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - యువ తెలంగాణ పార్టీ లేటెస్ట్ వార్తలు
ఖమ్మం జిల్లా కేంద్రంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు.
ఖమ్మంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపిస్తే ఆయన ప్రగతి భవన్లో పాలేరు ఉద్యోగం చేస్తున్నారని ముఖ్యఅతిథిగా హాజరైన రాణి రుద్రమ ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: అధ్యక్ష బాధ్యతలు ట్రంప్ వల్లకాని విషయం: ఒబామా