ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో గౌడ సంఘం మొదటి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. గౌడ సంఘం వెనకబడిపోయిందని... ప్రభుత్వమే ఆదుకోవాలని రాష్ట్ర నాయకుడు బత్తుల సోమయ్య కోరారు. అన్ని సంఘాలతో పాటు ఈ సంఘాన్ని కూడా గుర్తించి ఆదుకోవాలన్నారు. గీత వృత్తి దినదిన గండంగా మారిందని... ప్రభుత్వమే తాటి, ఈత మొక్కలు నాటి గౌడ సంఘం సభ్యులకు ఆసరాగా నిలవాలన్నారు.
'ఈత, తాటి మొక్కలను ప్రభుత్వమే నాటాలి' - ఈత, తాటి మెుక్కలను ప్రభుత్వమే నాటాలి
ఖమ్మం జిల్లా చేగొమ్మ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఒక వర్గం వారు తమకు సమాచారం ఇవ్వలేదని సభను అడ్డుకున్నారు. గందరగోళ వాతావారణంలో సంఘం రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ తలెత్తింది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దుకాణాలు ఏర్పాటు చేయాలని... కల్లును రోగ నిరోధక శక్తిగా...ఔషధంగా వాడుతున్నారని వివరించారు. కల్లును నీర అని అంటారని...దాన్ని నిల్వ చేసి దుకాణాల్లో విక్రయించాలని కోరారు. నీరతో చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా మహాసభ జరుగుతుండగా సభలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సభకు గౌడ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిద్ధి రామ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ కొరడా
TAGGED:
gowda sangam zilla sabha