తెలంగాణ

telangana

ETV Bharat / state

'చాకలి ఐలమ్మ జయంత్సుత్సవాలు ప్రభుత్వమే నిర్వహించాలి'

ఖమ్మం నగరంలో చాకలి ఐలమ్మ జయంత్సుత్సవాలు ప్రభుత్వమే చేపట్టాలని ఖమ్మం జిల్లాలో రజక సంఘం డిమాండ్ చేసింది.

ఖమ్మం జిల్లాలో ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

By

Published : Sep 21, 2019, 11:14 PM IST

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపుడిలో నిర్మించిన ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఐలమ్మ జీవిత చరిత్రను సీఎం కేసీఆర్‌ గుర్తించి ఐదో తరగతి పాఠ్యాంశంగా చేర్చాలని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. భాజపా నాయకులు తెలంగాణ విమోచన దినాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సాయుధ పోరాట యోధుల పేర్లు ప్రస్తావించకుండానే విమోచన దినం పేరిట హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా కళాకారులు గీతాలతో అలరించారు.

ఖమ్మం జిల్లాలో ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details