పూర్తి వేతనాలివ్వాలంటూ ఉద్యోగుల నిరసనలు - lock down effect
లాక్డౌన్ కారణంగా వేతనాల్లో ప్రభుత్వం కోత విధించగా... ఉద్యోగులు రోడ్డెక్కారు. పూర్తి వేతనాలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా మధిరలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తి వేతనాలివ్వాలంటూ ఉద్యోగుల నిరసనలు
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని ఖమ్మం జిల్లా మధిరలో ఆందోళన నిర్వహించారు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సైదులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.