ఖమ్మం జిల్లా వైరా మండలంలోని కొండకొడిమ, రెబ్బవరం గ్రామాల్లో గుడ్‌ఫ్రైడేని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రైస్తవ సోదరులు ప్రత్యేక వేషధారణలో కల్వరీ గుట్ట వరకు ఏసుక్రీస్తు శిలువ మోసిన ఘట్టాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గ్రామాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు - వైరాలో ఘనంపై గుడ్‌ఫ్రైడే వేడుకలు
గుడ్‌ఫ్రైడే వేడుకలను ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పలు గ్రామల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రత్యేక వేశధారణలో ఏసుక్రీస్తు శిలువ మోసిన ఘట్టాన్ని ప్రదర్శించారు. ప్రభువు దీవెనలు అందరికీ ఉండాలని ప్రార్థించారు.
![గ్రామాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు good friday celebration in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11253711-883-11253711-1617370336137.jpg)
ప్రతి వ్యక్తి క్షమించడం, ప్రేమించడం అలవర్చుకోవాలని క్రైస్తవసోదరులు కోరారు. ఏసుక్రీస్తు బోధనలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ప్రభువు దీవెనలు అందరికీ ఉండాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి:ఇంటి వద్ద పరీక్షలు రాస్తున్న విద్యార్థులు