త్వరలోనే ఖమ్మం, సూర్యాపేట జిల్లాల వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నాలుగు వరుసల రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేలా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్గరుండి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా చేవేళ్లమోతే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పనులు జరుగుతున్నాయి.
శరవేగంగా కొనసాగుతున్న జాతీయ రహదారి పనులు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఖమ్మం-సూర్యాపేట నాలుగు వరుసల రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా చేవేళ్లమోతే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పనులు జరుగుతున్నాయి.
దాదాపు 20 ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న జాతీయ రహదారి నిర్మాణం తుది దశకు చేరింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో మంజూరైన పనులు గడువు కంటే ముందుగానే పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 58.06 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.1100 కోట్లు నిధులు బడ్జెట్లో కేటాయించింది. దీనికి జాతీయ రహదారి 365గా నామకరణం చేశారు. ఖమ్మం జిల్లాలోని నాయకుని గూడెం నుంచి జాతీయ రహదారి పనులు వేగం పుంజుకున్నాయి. పలుచోట్ల వంతెనలతోపాటు అండర్ బ్రిడ్జ్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.