తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవో నెంబర్ 20, 26ను ఉపసంహరించుకోవాలి' - ఖమ్మం జిల్లా వార్తలు

పంచాయతీరాజ్ కార్మికులను పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 20, 26 వెంటనే ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా​ చేశారు. తమను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

go Nos. 20, 26 should be withdrawn : panchayathi labours
'జీవో నెంబర్ 20, 26ను ఉపసంహరించుకోవాలి'

By

Published : Sep 10, 2020, 9:51 AM IST

ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్​ కార్మికులు ధర్నా నిర్వహించారు. పంచాయతీరాజ్ కార్మికులను పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 20, 26 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

జీవోలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details