తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం' - Khammam district news

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే.. ఆరోగ్యం మన సొంతమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఇంట్లోని చెత్తను పారవేయాలని సూచించారు. ఖమ్మంలో చెత్తను సేకరించే 30 ఆటోలను ప్రారంభించారు.

auto
auto

By

Published : Sep 26, 2020, 3:52 PM IST

Updated : Sep 26, 2020, 7:05 PM IST

ఖమ్మం నగరంలో చెత్తను సేకరించేందుకు నూతనంగా 30 ట్రాలీ ఆటోలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పెవిలియన్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ సహ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఇప్పటివరకే 20 ఆటోలు ఉన్నాయని.. మరో 30 ఆటోలతో ప్రత్యేకంగా కేటాయించిన డివిజన్లలోని చెత్తను సేకరిస్తామని పురపాలక అధికారులు తెలిపారు.

ప్రజలంతా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేసి పారిశుద్ధ్య కార్మికులు, పురపాలక సిబ్బంది పనిని సులభం చేయాలని మంత్రి కోరారు. ఇంట్లోని చెత్తను ఎప్పటికప్పుడు పారవేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Last Updated : Sep 26, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details