తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ జనాభాను బట్టి త్వరలో నిధులు - kmm

ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ సమావేశం నిర్వహించారు.

జనాభాను బట్టి త్వరలో నిధులు

By

Published : Sep 4, 2019, 7:43 PM IST

పంచాయతీల జనాభాను బట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేస్తుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, సర్పంచ్​లు, అటవీ శాఖ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి పంచాయతీకి నిధులు వచ్చిన తర్వాత అభివృద్ధికి గ్రామసభల ద్వారా ప్రణాళికలు వేసుకుని పనిచేయాలన్నారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనాభాను బట్టి త్వరలో నిధులు

ABOUT THE AUTHOR

...view details