తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లా మధిరలో ఉచిత వైద్య శిబిరం - madhira

ఖమ్మం జిల్లా మధిరలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉచిత వైద్యశిబిరం

By

Published : Apr 15, 2019, 3:44 PM IST

ప్రకృతి ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్యం అందించేలా ఉచిత వైద్య శిబిరాన్ని ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేశారు. స్థానిక రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ప్రారంభించారు. సమీప గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు. డాక్టర్ దీపక్ రావత్ వైద్య పరీక్షలు నిర్వహించి... అవసరమైన మందులను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ దేవేందర్, సీనియర్ హోమియో వైద్యులు జి.వి రమణ రావు, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఉచిత వైద్యశిబిరం

ABOUT THE AUTHOR

...view details