Khammam License Mela : ఖమ్మం నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేపట్టిన ఉచిత లైసెన్సు మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో విజయవంతంగా చేపట్టిన ఉచిత లైసెన్సుల మేళా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మంలో ఇటీవల ఈ లైసెన్సు మేళాకు శ్రీకారం చుట్టారు. రెండ్రోజుల క్రితం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ లైసెన్సు మేళా ప్రారంభించారు.
Minister Puvvada Proving Free License in Khammam : ఈ మేళాకు నగరవ్యాప్తంగా భారీగా యువతీ యువకులు తరలివచ్చి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వాహనం కలిగి ఉండి డ్రైవింగ్ లైసెన్సులు లేనివారికోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్ చేయించి, ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్సు ఇప్పించేలా పువ్వాడ ఫౌండేషన్ బాధ్యత తీసుకుంటోంది. ఖమ్మంలో దాదాపు 10 వేల మంది లైసెన్సులు లేని వారు ఉన్నట్లు గుర్తించామని.. వారందరికీ లైసెన్సుఇప్పిస్తామని పువ్వాడ అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు భరిస్తోందని తెలిపారు.
"నేను నా ఫౌండేషన్ ద్వారా లైసెన్స్ ఫీజు భరిస్తామని అనుకుంటున్నాను. టూ వీలర్ అయితే 300 రుపాయలు, టూ అండ్ ఫోర్ వీలర్ అయితే 450రూపాయలు. ఈ లైసెన్స్ మేళా రెండు నెలలు ఉంటుంది. తీసుకునేవాళ్లు ఖమ్మం వాసులై ఉండాల. లైసెన్స్ లేకుండా ఎవరు బండ్లు నడపకూడదు. మనం జాగ్రత్తగా నడపాలి మన వల్ల ఎవ్వరి ప్రాణం పోకూడదు, ఇతరుల వల్ల మన ప్రాణానికి ఏమీ జరగకూడదు."- పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి