ఖమ్మం జిల్లా చిన్న బీరవల్లిలో వాగు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో అటువైపు వచ్చిన కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. స్పందించిన స్థానికులు కారులో ఉన్న నలుగురు వ్యక్తులను ప్రాణాలతో కాపాడారు.
వాగులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు వ్యక్తులు సేఫ్ - car Washed away at chinna biravelli khammam
కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షానికి చిన్న బీరవల్లి వాగు పొంగి పొర్లుతోంది. అటువైపు వెళ్లిన ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడిపోయింది. అది గమనించిన స్థానికులు వాగులోకి వెళ్లి కారులోని వ్యక్తులను బయటకు తీసుకొచ్చారు. కారు మాత్రం కనిపించకుండా పోయింది.

వాగులోకి దూసుకెళ్లిన కారు.. అందులో నలుగురు వ్యక్తులు..
రాపల్లి నుంచి బోనకల్ వస్తుండగా మధిరకు చెందిన ఇద్దరు, బ్రాహ్మణపల్లికి చెందిన ఒకరు, పొద్దుటూరుకు చెందిన మరొకరు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతుండగా ఆ ప్రాంత వాసులు కాపాడారు. చివరకు కారు పోయింది.. బతుకు జీవుడా అంటూ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
వాగులోకి దూసుకెళ్లిన కారు.. అందులో నలుగురు వ్యక్తులు..
ఇదీ చూడండి :చిన్న పిల్లలకు కూడా తాపించండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్