తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో - protest by formers at kodada khammam highway

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం సరిగా లేదనే సాకుతో ఒక్కో లారీకి 20 నుంచి 40 బస్తాలు కోత విధిస్తామని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చెప్పడంతో రైతులు ధర్నా బాట పట్టారు. స్థానిక తహసీల్దార్ హామీతో వారు శాంతించారు.

formers protest at kodada khammam national highway
కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

By

Published : Dec 7, 2020, 5:06 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో తీసుకెళ్లి.. ధాన్యం సరిగా లేదనే సాకుతో లారీలను వెనుకకు తీసుకొచ్చారని వాపోయారు. ఒక్కో లారీకి 20 నుంచి 40 బస్తాలు కోత విధిస్తామని చెప్పడంతో ఆందోళన చెందిన రైతులు కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై కొన్ని కిలోమీటర్ల వరకు వాహనాలు స్తంభించిపోయాయి. స్థానిక తహసీల్దార్ రైతుల వద్దకు చేరుకొని.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:'పోస్టులు భర్తీ చేస్తారా.. కారుణ్య మరణాలకు అనుమతిస్తారా.?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details