రైతాంగ సమస్యల పరిష్కారించాలని కోరుతూ... సుబాబులు, జామాయిల్ పంటల రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ ఎదుట నిర్వహించే మహాధర్నాకు వెళ్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టును నిరసిస్తూ.. వామపక్షాలు, భాజపా ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు ప్రధాన కూడళ్లలో ఆందోళన చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రైతుల రాస్తారోకోలు.. పోలీసుల అడ్డగింత - ఖమ్మం జిల్లాలో రాస్తారోకోలు
రైతు సంఘాల ఆధ్వర్యంలో సారపాకలో నిర్వహిస్తున్న మహాధర్నాకు వెళ్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో రాస్తారోకోలు చేపట్టారు.
రైతుల రాస్తారోకోలు.. పోలీసుల అడ్డగింత
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:బ్రహ్మాజీ కొడుకని హీరోయిజం చూపించాడు