ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న అభియోగంపై పినపాక మాజీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పినపాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు.. పోలింగ్ ముందు రోజున ఓటర్లకు డబ్బులు పంచారన్న అభియోగంపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అశ్వాపురం పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంపై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు.. పాయం వెంకటేశ్వర్లు, ఆయన అనుచరుడు గడ్డాల నాగేశ్వర్ రావుపై అభియోగాలు రుజువైనట్లు ఇవాళ ప్రకటించింది.
మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలలు జైలు శిక్ష - మ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వార్తలు
పినపాక మాజీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నియోజకవర్గం నుంచి 2018లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు.. పోలింగ్ ముందు రోజున ఓటర్లకు డబ్బులు పంచారన్న అభియోగంపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై విచారించిన కోర్టు పాయం వెంకటేశ్వర్లు, ఆయన అనుచరుడు గడ్డాల నాగేశ్వర్‌కు జైలు శిక్ష విధించింది.
![మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలలు జైలు శిక్ష venkateshwarlu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12753557-944-12753557-1628778083546.jpg)
వెంకటేశ్వర్లు
ఇద్దరికీ ఆరు నెలల చొప్పున జైలు శిక్ష, పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. పాయం వెంకటేశ్వర్లు, గడ్డాల వెంకటేశ్వర్లు జరిమానా చెల్లించడంతో.. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా జైలు శిక్షను ఆరు నెలల పాటు నిలిపివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండలో 2018లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తోపాటు మరో ముగ్గురిపై పెట్టిన కేసు వీగిపోయింది.