ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలను తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. డప్పు చప్పుళ్లతో, కోలాట నృత్యాలతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన రాక సందర్భంగా 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండ పుల్లయ్య, జిల్లా నాయకులు రమేశ్ రెడ్డి, నరేశ్ రెడ్డి, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఎడ్ల పందేలను ప్రారంభించిన మాజీ మంత్రి - కార్తిక పౌర్ణమి
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఎడ్ల పందేలను ప్రారంభించిన మాజీ మంత్రి