ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తెరాస సీనియర్ నాయకులు నాగమణి, నాగుబండి సత్యనారాయణతో పాటు పలువురి కుటుంబాలను పరామర్శించారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తా' - పాలేరు తాజా వార్తలు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. తెరాస సీనియర్ నాయకులు నాగుబండి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెరాస కార్యకర్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం వార్తలు
గతంలో నిలిచిపోయిన పనుల గురించి ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. తెరాస కార్యకర్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ జిల్లా నాయకులు సాధు రమేశ్ రెడ్డి, తమ్మినేని కృష్ణయ్య, బండి జగదీశ్, జొన్నలగడ్డ రవి, శాఖమూరి రమేశ్, నెల్లూరు భద్రయ్య, లక్ష్మీ నర్సయ్య, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా