యాచకులకు భోజనం, దుప్పట్లు - మధిరలో దుప్పట్ల పంపిణీ
మధిర రైల్వే స్టేషన్, బస్టాండు పరిసరాల్లో ఉండే యాచకులకు స్థానిక సుశీల విద్యాసంస్థల అధినేత భోజనం, దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమానికి తహసీల్దార్ సైదులు హాజరై అభాగ్యులకు అందించారు.

యాచకులకు భోజనం, దుప్పట్ల అందజేత
ఖమ్మం జిల్లా మధిరలోని యాచకులకు సుశీల విద్యాసంస్థల అధినేత బూస కోటేశ్వరరావు అండగా నిలిచారు. ఖాళీ కడుపులతో అలమటిస్తున్న వారికి భోజనం అందించారు. రైల్వే స్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో ఉండే వారికి దుప్పట్లు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పెమ్మరాజు పార్థసారథి, వాసవి క్లబ్ ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. తహసీల్దార్ సైదులు, సామాజిక సేవకుడు లంక కొండయ్య హాజరై పంపిణీ చేశారు.
యాచకులకు భోజనం, దుప్పట్ల అందజేత