ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన కుమార్ షావలి ప్రారంభించారు.
న్యాయస్థాన గదులు ప్రారంభం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన కుమార్ షావలి ప్రారంభించారు.
న్యాయస్థాన గదులు ప్రారంభం..
న్యాయవాదులు ప్రజలను చైతన్య పరచాలని న్యాయమూర్తులు, న్యాయవాదులకు సమన్వయం ఉండాలన్నారు. సీనియర్, జూనియర్ న్యాయవాదుల మధ్య పరస్పరం మంచి సంబంధాలు ఉండాలని అభిలాషించారు. సీనియర్లు, జూనియర్లను చైతన్యం చేయాలని సూచించారు. నూతన భవన నిర్మాణానికి సహకారం అందించిన గుత్తేదారు ఇంజనీర్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ భవన నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని, జిల్లా నాల్గో అదనపు న్యాయమూర్తి జడ్జీ సాయి భూపతి, సీనియర్ సివిల్ జడ్జీ జస్టిస్ అఫ్రోజ్ అక్తర్, జూనియర్ సివిల్ జడ్జీ జస్టిస్ యువరాజుతో కలసి ఆవిష్కరించి న్యాయస్థానం గదులను ప్రారంభించారు. అనంతరం సర్వ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
పలువురు న్యాయవాదులు తమ సమస్యల విన్నవించగా పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంత్రి ప్రగడ సత్యనారాయణ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపాలరావు, న్యాయవాదులు భాష బుజ్జి సాహెబ్, కంచర్ల వెంకటేశ్వరరావు, శ్రీధర్ ,రామకృష్ణ ,బుర్ర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత