అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు... మున్నేరు నదికి అనూహ్యంగా వరద పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుడంటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం వద్ద పూర్తిస్థాయి నీటి మట్టాన్ని మించి ప్రవహిస్తోంది.
అల్పపీడన ప్రభావంతో మున్నేరు నదికి భారీగా వరద - మున్నేరు నదికి వరద
అల్పపీడన ప్రభావంతో మున్నేరు నదికి భారీగా వరద చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు మున్నేరు పాతవంతెనపై రాకపోకలు నిషేధించి... లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అల్పపీడన ప్రభావంతో మున్నేరు నదికి భారీగా వరద
ప్రవాహం పెరిగినందున మున్నేరు పాత వంతెనపై రాకపోకలను నిషేధించారు. వంతెన పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వర కాలనీ, మోతీనగర్, మంచికంటినగర్ ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి:గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!