తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం - 5 kgs baby girl born in khammam hospital

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది.

five kilo grams baby birl born in khammam hospital
ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం

By

Published : May 10, 2020, 1:13 PM IST

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. డాక్టర్​ రమేశ్ ఆధ్వర్యంలో ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపను బయటకు తీశారు.

5కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details