తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో మొదలైన చేపల వేట - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేటకు మత్స్య సహకార సంఘం పచ్చజెండా ఊపింది. సహకార సంఘం ఆధ్వర్యంలో మే 29న తెల్లవారుజామున మత్స్యకారులు చేపల వేట ఆరంభించారు. స్థానిక ప్రజలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి చేపల కోసం పెద్దఎత్తున కొనుగోలుదారులు వచ్చారు.

fish Hunting Starts In Waira
వైరాలో మొదలైన చేపల వేట

By

Published : May 29, 2020, 4:15 PM IST

ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేట ప్రారంభమయింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మే 29 తెల్లవారుజామున చేపల వేట ఆరంభించారు. కరోనా, లాక్​డౌన్​ నేపథ్యంలో దాదాపు నెలరోజులుగా చేపల వేట ఆగిపోయింది. జిల్లాలో వైరా చేపలకు మంచి గిరాకీ ఉండడం వల్ల వైరా జలాశయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చేపల కోసం తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం కోసం వైరా జలాశయం దగ్గర లారీలు సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది పెన్​ కల్చర్​ విధానం అవలంబించడం వల్ల చేపలు మంచి సైజులో వచ్చాయి. ఒక్కో చేప ఐదు కిలోల వరకు ఉంది. దిగుబడులు పూర్తయ్యేవరకు నిరంతరాయంగా చేపల వేట, విక్రయం కొనసాగుతుందని ఎఫ్​డీవో శివప్రసాద్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details