మృగశిర కార్తె ప్రారంభ రోజున చేపలు కొనేందుకు వచ్చిన ఖమ్మం నగర వాసులతో చేపల మార్కెట్ వద్ద సందడి నెలకొంది. డిమాండ్‌ని ముందుగానే ఊహించి మార్కెట్‌కి కూడా వ్యాపారులు చేపలను భారీగా తీసుకొచ్చారు.
సందడిగా మారిన చేపల మార్కెట్లు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
మృగశిర కార్తె రోజు కావడంతో చేపలు కొనేందుకు ప్రజలు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. ఖమ్మంలోని పలు చేపల మార్కెట్లు సందడిగా మారాయి.
సందడిగా మారిన చేపల మార్కెట్లు
నగరంలోని డిపో రోడ్డు, బైపాస్ రోడ్డు, ఎన్టీఆర్ కూడలి వద్ద చేపలు కొనేందుకు వచ్చిన నగర వాసులతో రద్దీ నెలకొంది. అందరూ ఒకేసారి రావడంతో భౌతిక దూరం పాటించలేదు. ఈరోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు దరిచేరవని ప్రజలు నమ్ముతుంటారు.
ఇదీ చూడండి: Mehul Choksi: వేల కోట్లకు ట్రాప్ వేసిన అమ్మాయి!