ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు నిరవధిక దీక్షలు చేపట్టారు. విధులు బహిష్కరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బైఠాయించి.. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
వైరా నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్షలు - field aasistant protest in front of mro office in wyra
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నిరవధిక దీక్షలు చేపట్టారు.
![వైరా నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్షలు field aasistant protest in front of mro office in wyra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6398620-thumbnail-3x2-nirasana-vysh.jpg)
వైరా నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్షలు
14 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగభద్రత కల్పించాలని.. పనిదినాలతో సంబంధంలేకుండా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ. 21,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వైరా నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్షలు
ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్