ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రెండు గంటలపాటు ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని.. వారు బదిలీ అవుతుండడం తమకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.
పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పాసుపుస్తకాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది అవస్థలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ఆందోళన